Fancy Number: 9999 ఫ్యాన్సీ నంబర్‌ కు రూ.9,99,999.. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర

హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌ లో సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం.

Representative Image (Pic Credit- PTI)

Hyderabad, Sep 6: హైదరాబాద్‌ (Hyderabad) ఈస్ట్‌ జోన్‌ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల (Fancy Number) బిడ్డింగ్‌ లో (Bidding) సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర పలికింది. టీఎస్‌11ఈజడ్‌ 9999 నెంబర్‌ను రూ.9,99,999కు చర్చ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ దక్కించుకున్నదని అధికారులు  తెలిపారు. టీఎస్‌11ఎఫ్‌ఏ 0001 నంబర్‌ను 3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకొన్నాడని పేర్కొన్నారు. అదే సిరీస్‌తో 0011 నంబర్‌ను శ్యామల రోహిత్‌రెడ్డి రూ.1.55 లక్షలకు దక్కించుకొన్నారని తెలిపారు. మొత్తంగా ఆర్టీఏ ఖాజానాకు రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement