Dasara Holidays: నేటి నుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు.. ఈ నెల 26న తిరిగి ప్రారంభం కానున్న ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్
నేటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
Hyderabad, Oct 13: నేటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో (Telangana) ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను (Dasara Holidays) ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో మొన్నటివరకు పరీక్షలు ముగిశాయి. నిన్న స్కూల్స్, కాలేజీలలో (Colleges) పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలతో స్కూళ్లు, కాలేజీలకు తరలి వచ్చారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఆడారు. నేటి నుంచి దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ ఊళ్లకు బయలుదేరారు. దీంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement