TRS MPs Protest: ప్రధాని మోదీ వ్యాఖ్యలు కలకలం, పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.

TRS MPs Protest (Photo-ANI)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement