Fire Accident In Hyderabad: కుషాయి గూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం
ఈ దుర్ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. కట్టెల మండీలో చెలరేగిన మంటలతో కలపపూర్తిగా దహనమవ్వడంతో పాటు పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో ముగ్గురు కాలిపోయారు.
Hyderabad, April 16: హైదరాబాద్ (Hyderabad) లోని కుషాయిగూడ (Kushaiguda) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. కట్టెల మండీలో చెలరేగిన మంటలతో కలపపూర్తిగా దహనమవ్వడంతో పాటు పక్కనే ఉన్న ఇంట్లోకి (House) మంటలు వ్యాపించడంతో ముగ్గురు కాలిపోయారు. మృతులు యాదాద్రి భువనగిరి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులైన.. నరేష్, సుమ దంపతులు కాగా వారి కుమారుడు జోషిత్ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అర్పేప్రయత్నంచేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)