Newdelhi, April 16: రాజస్థానీ సౌందర్యానికి ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India 2023) కిరీటం మురిసిపోయింది. ఈసారి 19 ఏళ్ల రాజస్థాన్ భామ నందినీ గుప్తా (Nandini Gupta) మిస్ ఇండియా (Miss India) కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. చివరికి, తన అందం, అభియనంతో ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీ గుప్తా విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Nandini Gupta of Rajasthan crowned Femina Miss India World 2023 #news #dailyhunt https://t.co/3UECWzTj3w
— Dailyhunt (@DailyhuntApp) April 16, 2023
మొదటి రన్నరప్ శ్రేయా పూన్జా
కార్తీక్, అనన్య వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. అన్ని పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి ఆమెకు కిరీటాన్ని తొడిగారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌గా నిలిచారు.