Hyderabad Fire: వీడియో ఇదిగో, కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీక్, ఒక్కసారిగా ఎగసిన మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు
హైదరాబాద్ లోని కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రధాన రహదారి రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చూసి స్థానికులు పరుగులు పెట్టారు
హైదరాబాద్ లోని కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రధాన రహదారి రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చూసి స్థానికులు పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ ను మళ్లించారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో గ్యాస్ ఏజెన్సీ వారు సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్ కు సిబ్బంది మరమ్మతులు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)