Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది.

Revanth Reddy in Assembly (Photo-Video Grab)

తెలంగాణలో గ్రూప్‌-1 (Group-1) అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. త్వరలోనే పోలీసు శాఖలో 15వేల ఉద్యోగ నియామకాలు చేపడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుంది’’ అని సీఎం అసెంబ్లీలో తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)