Hyderabad Horror: హైదరాబాద్ లో మరో చిన్నారిపై కుక్క దాడి.. వెనుక నుంచి వచ్చి దాడి చేసిన శునకం.. తీవ్రంగా గాయపడ్డ ఆరేళ్ల బాలుడు.. పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చికిత్స (వీడియోతో)
హైదరాబాద్ లో మరో చిన్నారిపై కుక్క దాడి జరిగింది. అత్తాపూర్-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి దిగింది.
Hyderabad, Nov 28: హైదరాబాద్ (Hyderabad) లో మరో చిన్నారిపై కుక్క (Dog) దాడి జరిగింది. అత్తాపూర్-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క (Stray Dog) దాడికి దిగింది. బాలుడు వీధిలో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన శునకం అమాంతం అతడిపై దూకి దాడి చేసింది. శరీరంపై పలు చోట్ల బలంగా కొరికింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్నవారు గమనించి హుటాహుటిన బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్తితి విషమంగా ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)