Bus Caught Fire Video: వీడియో ఇదిగో, అర్థరాత్రి మంటల్లో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 26 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు(కావేరీ) మిర్యాలగూడ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్‌ వద్ద ఒక్కసారిగా టైరు పేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Bus Fire (Photo-Video Grab)

హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 26 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు(కావేరీ) మిర్యాలగూడ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్‌ వద్ద ఒక్కసారిగా టైరు పేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులను నిద్రలేపి బస్సు నుంచి బయటకు పంపించాడు.

అదే సమయంలో సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఫ్లైఓవర్‌ పక్కనే ఆగి ఉన్న ఉల్లిగడ్డలోడు లారీకి మంటలు వ్యాపించి సరకు స్వల్పంగా దగ్ధమైంది. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు యాజమాన్యం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.

Bus Fire (Photo-Video Grab)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement