Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూంకు మెయిల్
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు మెయిల్ చేశాడు.
Hyderabad, Aug 29: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) బాంబు పెట్టామంటూ (Bomb Threat) ఓ వ్యక్తి ఈమెయిల్ (e-mail) ద్వారా బెదిరించడం కలకలానికి దారితీసింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు మెయిల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఉత్తుత్తి బెదిరింపు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్ ఆధారంగా గుర్తు తెలియని దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)