Hyderabad Shocker: ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో వైరల్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ అరెస్ట్
ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్,ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్,ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది. అసలు ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేశాడో తెలియదు… ఎమ్మెల్యే గోపీనాథ్ పిఏ భాస్కర్ మాత్రం విచక్షణ రహితంగా కొట్టాడు.
పెద్ద కర్ర తీసుకొని ఎడాపెడా ఇరగదీశాడు. అతను కొట్టడమే కాకుండా తన అనుచరులతో కూడా కొట్టించాడు. ఇక ఈ వీడియోని చూసిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, ఇతరులు ఫైర్ అవుతున్నారు. భాస్కర్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ తరుణంలోనే… మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ అరెస్ట్ అయ్యాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)