Jabalpur Road Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం, కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారంటూ గుండెలు పగిలేలా రోదించిన తల్లి, మనవళ్లు అనాధలు అయ్యారని ఆవేదన
ఈ ప్రమాదంలో కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. జబల్ పూర్ యాక్సిడెంట్ లో నాచారంకు చెందిన 8 మంది మృతుల్లో సంతోష్ ఆయన భార్య ఉన్నారు. తన ఇద్దరు మనవళ్లు అనాధలు అయ్యారని కన్నీరుమున్నీరుగా విలపించింది సంతోష్ తల్లి.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన ఈ విషాద ప్రమాదంలో (Madhya Pradesh Accident) మొత్తం ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా నుండి వీరంతా తిరిగి వస్తుండగా, వారి మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులందరూ హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందినవారని అధికారులు నిర్ధారించారు.
జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. బస్సులో ఉన్న మిగతా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. జబల్ పూర్ యాక్సిడెంట్ లో నాచారంకు చెందిన 8 మంది మృతుల్లో సంతోష్ ఆయన భార్య ఉన్నారు. తన ఇద్దరు మనవళ్లు అనాధలు అయ్యారని కన్నీరుమున్నీరుగా విలపించింది సంతోష్ తల్లి.
కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారంటూ గుండెలు పగిలేలా రోదించిన తల్లి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)