Kamareddy Road Mishap: కామారెడ్డి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.

CM KCR inaugurate Mallanna Sagar (Photo-Video Grab)

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బాధితులకు తక్షణ సహాయం కింద మూడు లక్షలు అందించారు. పిట్లం మండలం చిల్లెర్గి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)