KTR on Ganga Reddy Murder Case: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి
తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రానికి పూర్తి స్థాయి హోంమంత్రి లేకపోగా.. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా బిజీగా ఉండటంతో శాంతి భద్రతల అమలు కుంటుపడిందని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ పెద్దలు ఇకనైనా విజ్ఞతతో ఆలోచిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాన్ని కాపాడే ప్రాథమిక పనిపై దృష్టి సారించేలా సమర్థులైన పోలీసులు అధికారులకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Here's KTR Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)