Telangana Cong leader T. Jeevan Reddy protests over key follower’s murder in BRS stronghold

Hyd, Oct 22: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలకే భరోసా లేదని, తాను ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేనని చెప్పారు.

కాంగ్రెస్ నేతను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి రీల్, పోలీసుల తీరును తప్పుబట్టిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో

"నీకో దండం... నీ పార్టీకో దండం" అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేయగా... తాను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, పార్టీ కోసం తన నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారంటూ ఫోన్ కట్ చేశారు.

జాబితాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(58) ఉదయం పని నుంచి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే కొన్ని రోజులుగా అతణ్ని చంపేందుకు పథకం రచించిన గుర్తుతెలియని దుండగలు.. ఇవాళ ఉదయం గ్రామానికి చేరిన కాంగ్రెస్ నేత గంగారెడ్డిని ఒక్కసారిగా కారుతో ఢీకొట్టారు.

T. Jeevan Reddy protests over key follower’s murder

గంగారెడ్డి కిందపడిపోగానే అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. కత్తులతో కడుపులో పొడిచారు. దీంతో అతని తీవ్రగాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న గంగారెడ్డిని హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గంగారెడ్డి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు.

హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

హత్య గురించిన తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. గంగారెడ్డిని హత్య చేయడంపై వారంతా ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఎమ్మెల్సీ అన్నారు. క్రీయాశీలకంగా పార్టీలో పని చేస్తే చంపేస్తారా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నిందితులను పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

 కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత 

పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాటిని బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జాబితాపూర్ గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. భారీగా మెుహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేశారు. గంగారెడ్డి హత్యకు రాజకీయ కక్షలా లేక మరైదేనా విషయం ఉందా అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.