Lasya Nanditha Last Rites: అశ్రు నయనాల మధ్య ముగిసిన లాస్య నందిత అంత్య‌క్రియ‌లు, మారేడ్‌ప‌ల్లి శ్మ‌శాన‌వాటిక‌లో ప్ర‌భుత్వ లాంఛనాల‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తుది వీడ్కోలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు.

Lasya Nanditha Last Rites (Photo-X)

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు. ఇంటి నుంచి సాగిన అంతిమయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాడె మోశారు.

కారు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై లాస్య నందిత సోద‌రి నివేదిత ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. డ్రైవ‌ర్ ఆకాశ్‌పై 304ఏ సెక్ష‌న్ కింద పటాన్‌చెరు పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంద‌న్నారు. డ్రైవ‌ర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి వేగంగా కారు న‌డిపి లాస్య మృతికి కార‌ణ‌మ‌య్యాడ‌ని ఆమె అన్నారు.  డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి, కారు డ్రైవ‌ర్ ఆకాశ్‌పై కేసు న‌మోదు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన అడిష‌న‌ల్ ఎస్పీ సంజీవ‌రావు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement