Munugode Bypoll 2022: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారుపై దాడి, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

TRS Activists Attack on BJP MLA Etela Rajender Car

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్‌.

ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు.బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన క్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement