Patancheru MLA Son Dies: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి, కిడ్నీలు పాడవటంతో ఆస్పత్రిలో చేరిన విష్ణువర్ధన్‌రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు. కిడ్నీలు పాడవటంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వైద్యులు విష్ణువర్ధన్‌కు డయాలసిస్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున గుండెపోటు రావటంతో మృతి చెందారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. కుమారుడి మృతితో మహిపాల్‌రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)