Jagtial Horror: 'మంత్రాలు చేసేవాళ్లని చంపబోతున్నాం' అంటూ జగిత్యాల జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు.. వీడియో ఇదిగో..!

మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ శిలాఫలకానికి వాల్ పోస్టర్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.

Jagtial Horror (Credits: X)

Jagtial, Oct 15: జగిత్యాల (Jagtial) జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలిసిన పోస్టర్లు (Posters) కలకలం సృష్టించాయి. మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ శిలాఫలకానికి వాల్ పోస్టర్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు. మంత్రాలూ చేస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న మంత్రగాళ్ళను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ పోస్టర్లలో హెచ్చరించారు. మంత్రగాళ్లకు సపోర్ట్ చేసేవారిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఆకతాయిలు ఉద్దేశ్యపూర్వకంగా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)