KA Paul Slams CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు, కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు. ఇంకోరోజు సర్పంచులు వస్తే వారిని అరెస్టు చేయిస్తాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే అరెస్టు చేయిస్తాడు. నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటే వారి మీద లాఠీ ఛార్జ్ చేయిస్తాడని మండిపడ్డారు. 422 బిల్డింగులు అక్రమంగా కూల్చారు.. సీఎం సోదరుడి బిల్డింగును ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. కలిసి పనిచేద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని సూచించారు. మరో రెండేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావడం ఖాయమని అన్నారు.
సీఎం రేవంత్‌పై KA పాల్ ఫైర్