Allu Arjun and CM revanth Reddy (Photo/X/FB)

Hyderabad, Dec 24: సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీకి చెందిన నేతలు ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని తెలంగాణ పీసీసీకి సీఎం స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)

లీగల్ టీంతో భేటీ అయిన అల్లు అర్జున్

నేటి ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్ లో విచారణకు బన్నీ వెళ్ళనున్నారు. ఈ మేరకు  అల్లు అర్జున్ తన లీగల్ టీంతో భేటీ అయ్యారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీడియో ఇదిగో, అల్లు అర్జున్ టీమ్ తమకు అండగా నిలుస్తోందని చెప్పిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్, తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు అండగా నిలిచిందని వెల్లడి