Mahalaxmi Scheme: 28వ తేది నుంచి రూ 500కే గ్యాస్ సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.

Credits: Social Media

Hyderabad, Dec 21: మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు ఎంతమంది, ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలనేది నిర్ణయించనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతనేది లెక్కలు తీస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడనుందని అంచనా.

Corona Cases: కరోనా డేంజర్‌ బెల్స్‌.. దేశంలో ఒక్క రోజే 614 కేసులు.. ముగ్గురి మృతి.. జేఎన్‌.1 రకం 21 కేసులు నమోదు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now