Counting Day: డిసెంబర్ 3న కౌంటింగ్.. హైదరాబాద్ లో సెక్షన్ 144.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు.. మద్యం అమ్మకాలు, బాణసంచా కాల్చడం, ప్రజలు గుమిగూడటంపై నిషేధం
ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు.
Hyderabad, Dec 2: ఆదివారం ఎన్నికల కౌంటింగ్ (Election Counting) నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో సెక్షన్ 144 (Section 144) విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)