Hyderabad, Dec 2: ఎన్నికల వేళ హైదరాబాద్ (Hyderabad) లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో (TSTDC) శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆఫీసు లోని (Office) పలు కీలక ఫైళ్లు (Important Files) , కంప్యూటర్లు, ఫర్నీచర్ అగ్నికీలల్లో పడి కాలి బూడిదైపోయాయి. కిటికీ అద్దాలకు ఉండే ఫైర్ బీడింగ్ మంటలకు మెత్తబడి కింద నిలిపి ఉంచిన కారుపై పడటంతో అది కూడా కాలిపోయింది. ఘటన సమాచారం అందగానే పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. గౌలిగూడ, అసెంబ్లీ ప్రాంగణంలోని అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంటలు#TSTDC #FireBreaksOut #Hyderabad #TeluguNewshttps://t.co/SMaCUAWY5j
— Eenadu (@eenadulivenews) December 2, 2023
ఎలా జరగొచ్చు??
విధులు ముగించుకుని వెళ్లిన సిబ్బంది కంప్యూటర్లను స్విచ్ఛాఫ్ చేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు సంస్థ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ ఎవరైనా కార్యాలయంలోకి వెళ్లి నిప్పు రాజేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.