Election Commission of India. (Photo Credit: Twitter)

New Delhi, December 01: కేంద్ర ఎన్నికల సంఘం (CEC) కీలక నిర్ణయం తీసుకుంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Mizoram Counting) తేదీలో మార్పు చేసింది. డిసెంబర్ 3కు బదులుగా 4న కౌంటింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈసీ ఈ డెసిషన్ తీసుకుంది. కాగా, మిగిలిన రాష్ట్రాల్లో(తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్) మాత్రం డిసెంబర్ 3నే ఓట్ల లెక్కింపు (Counting) జరగనుంది. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 80శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 

షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటుగా మిజోరంలోనూ డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే, మిజోరంలో ఆదివారం కాకుండా మరో రోజు ఓట్ల లెక్కింపు జరపాలని అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి.

Telangana Cabinet Meeting: ఫలితాలకు ముందే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, డిసెంబ‌ర్ 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

దీంతో, వారి వినతులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు తేదీని డిసెంబర్‌ 4కు (సోమవారం) మార్పు చేసింది. కాగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.