Black Magic Rituals Near KCR House: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న అధికారులు
ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్ ఇంటి పక్కన గల ఖాళీ ప్రాంతంలో చేతబడి, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో నిమ్మ కాయలు, బొమ్మ, మిరపకాయ, పాలిథిన్ కవర్‌లో నల్ల కోడి ఈక, కోడి గుడ్డు, కుంకుమ, చీర, పసుపుతో ముగ్గు వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అవి చూసి స్థానికులు కేసీఆర్ ఇంటి వద్ద గల సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దాంతో క్షుద్ర పూజల గురించి తెలిసింది. క్షుద్రపూజల గురించి తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అర్థరాత్రి ఏటీఎంలో చొరబడి రూ. 18 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు, సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేసి మరీ..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)