హైదరాబాద్ నగర శివారు ఏరియా శంషాబాద్ లో గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి రూ.18,99,000 నగదు దోచుకెళ్లారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఈ నెల 14న సీఎంఎస్‌ కంపెనీ వారు ఈ ఏటీఎంలో రూ.21 లక్షలు జమ చేశారు. ఆదివారం అర్థరాత్రి 1.59 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి..మొదట ఏటీంలోని సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేశారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న నగదు రూ.18,99,000 దోచుకున్నారు.

ఏటీఎంలో దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తుండగా..చివరి సమయంలో అక్కడ ఉన్న సేఫ్టీ పరికరాల ద్వారా ముంబయిలోని నిర్వహణ సంస్థకు అలర్ట్‌ వెళ్లింది. దీంతో సంస్థ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల తర్వాత శంషాబాద్‌ ఎస్‌హెచ్‌ఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి దుండగులు నగదుతో పారిపోయారు.ఏటీఎం కేంద్రాన్ని డీసీపీ నారాయణరెడ్డి, సీఐ నరేందర్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)