Minister KTR Davos Tour: తెలంగాణలో రూ.1000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న స్టాడ్‌లర్‌, రైలు కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులు

రైల్‌ కోచ్‌ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్‌లర్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఈవీపీ ఆన్స్‌గర్‌ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో చర్చలు జరిపారు.

Minister KTR Davos Tour

రైల్‌ కోచ్‌ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్‌లర్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఈవీపీ ఆన్స్‌గర్‌ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగియడంతో త్వరలో తెలంగాణలో రైలు కోచ్‌ల తయారీ రంగంలో ఇన్వెస్ట్‌ చేయబోతున్నట్టు స్టాడ్‌లర్‌ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో నెలకొల్పబోయే రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం స్టాడ్‌లర్‌ సంస్థ రూ.1000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయబోతుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2500ల మంది యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ప్రైవేటు రంగంలో మేధా సంస్థ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. తాజాగా స్టాడ్‌లర్‌ సంస్థ రైల్‌ కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులకు రెడీ అయ్యింది. మేధా సంస్థతో కలిసి స్టాడ్‌లర్‌ తెలంగాణలో పని చేయనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ

KTR Slams CM Revanth Reddy: కొడంగల్‌లో నువు మళ్లీ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్‌, రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని నిలదీత

Share Now