Sudden Death in Telangana: వీడియో ఇదిగో, కల్లు గీస్తుండగా కార్మికుడికి గుండెపోటు, తాటి చెట్టుపైనే ప్రాణాలు వదిలిన గీత కార్మికుడు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పరిధిలోని రాజన్నగూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాటి చెట్టు పైనే గుండెపోటుతో కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పరిధిలోని రాజన్నగూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాటి చెట్టు పైనే గుండెపోటుతో కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు. గీత కార్మికుడి డెడ్‌బాడీని తాటి చెట్టుపై నుంచి పోలీసులు కిందకు దించారు. లక్ష్మయ్య(68) అనే గీత కార్మికుడు కల్లు గీసేందుకు బుధవారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. షాకింగ్ వీడియో ఇదిగో, భోగి వేడుకల్లో కోలాటం వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ, గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు..
అయితే కల్లు గీస్తుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో చెట్టుపైనే లక్ష్మయ్య ప్రాణాలొదిలాడు. స్థానిక రైతులు లక్ష్మయ్యను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)