Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్, దాదాపుగా 2.10 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడ్డారని నిర్థారించిన ఏసీబీ

రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్ (అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD)ని అదుపులోకి తీసుకున్నారు

Sheep Distribution Scam

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో విచారణలో భాగంగా ఏసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు అధికారులైన ఎస్. రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్ (అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై రాష్ట్రానికి దాదాపుగా 2.10 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు అధికార్లను ఏసిబి అరెస్ట్ చేసింది.  తెలంగాణ గొర్రెల స్కాంలో నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్, చంచలగూడ జైలుకు తరలించిన అధికారులు, మార్చి 7 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్), హైదరాబాద్‌లోని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాజీ OSD గుండమరాజు కళ్యాణ్ కుమార్, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. కుట్రలు చేసి, స్థూల చట్టవిరుద్ధమైన చర్యలు, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. నిందితులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా అనుచిత లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయమైన నష్టం కలిగించి రూ.2.1 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు.

ఏసీబీ ఆధికారులు వారిద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గొర్రెల స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు ఏసీబీ ఆధికారులు పదిమందిని అరెస్ట్ చేశారు.

Here's ACB Tweet



సంబంధిత వార్తలు