MLA Raja Singh: రాజాసింగ్‌పై 101 కేసులు, అందులో 18 కేసులు మత సంబంధితవేనన్న హైదరాబాద్ పోలీసులు, పీడీ యాక్ట్‌ ఎత్తేయాలన్న రాజాసింగ్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన అడ్వైజరీ బోర్డు

బీజేపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అడ్వైజరీ బోర్డు నుంచి చుక్కెదురు అయింది. పీడీ యాక్ట్‌ ఎత్తేయాలన్న రాజాసింగ్‌ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్‌పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది.

BJP MLA Raja singh

బీజేపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అడ్వైజరీ బోర్డు నుంచి చుక్కెదురు అయింది. పీడీ యాక్ట్‌ ఎత్తేయాలన్న రాజాసింగ్‌ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్‌పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది.

ఈ కేసును నిశితంగా పరిశీలించి ఇరువర్గాల వాదోపవాదాలు విని విచారణ చేపట్టిన కమిటీ.. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థించింది. అంతేకాదు.. పీడీ యాక్ట్‌ ఎత్తేయాలన్న రాజాసింగ్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆయనకు ప్రతికూలంగా బోర్డు ఇవాళ తీర్పు వెలువరించింది. రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు కమ్యూనల్‌(మత సంబంధిత) ఉన్నాయని పోలీసులు కమిటీకి నివేదించారు. దీంతో హైదరాబాద్ పోలీసుల వాదనతో ఏకీభవించింది అడ్వైజరీ కమిటీ.

Advisory Board Rejects BJP Suspended MLA Raja Singh Plea

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now