Telangana Assembly Session 2024: సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో
కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024 ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు.
కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతేగాక రాష్ట్రంలో ఖాళీ అయిన రేషన్ డీలర్లను వెంటనే భర్తీ చేయాలని ఇదివరకే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియ వెంటనే జరుగుతుందని, అలా జరగని పక్షంలో.. ఎక్కడ ఇబ్బందులు ఉన్నయో తెలియపరిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
New Smart Ration Cards issued from Post-Sankranti Says Uttam Kumar Reddy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)