Telangana: బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్‌ మృతి, పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు, 40 మంది ప్రయాణికులు సురక్షితం

ములుగు జిల్లా నూగూరు మండ‌లం ఎదిరి గ్రామం వ‌ద్ద‌కు రాగానే ఆ బ‌స్సు డ్రైవ‌ర్ గుండెపోటుకు కుప్పకూలిపోయాడు.

Bus Accident (Photo-Twitter)

కేర‌ళ రాష్ట్రానికి చెందిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు యాత్రికుల‌తో భ‌ద్రాచ‌లంలోని ప‌ర్ణ‌శాల నుంచి తిరిగి బ‌య‌ల్దేరిన సమయంలో డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. ములుగు జిల్లా నూగూరు మండ‌లం ఎదిరి గ్రామం వ‌ద్ద‌కు రాగానే ఆ బ‌స్సు డ్రైవ‌ర్ గుండెపోటుకు కుప్పకూలిపోయాడు. దీంతో బ‌స్సు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, బ‌స్సులోని యాత్రికులంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థలికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. యాత్రికులంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వార‌ని తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)