Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు, స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సంభవించిన పేలుడు, తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్‌రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న , ఆయన కుమారుడు సురేష్‌గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)