Telangana Formation Day: ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆనంతరం అమర వీరుల స్థూపానికి నివాళులు
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Hyderabad, June 2: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను (Telangana Formation Day) ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ప్రగతి భవన్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం గన్‌పార్క్ లోని అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అక్కడినుంచి సచివాలయానికి చేరుకుంటారు. జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)