Vinayaka Chavithi Wishes: రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, నవరాత్రులను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం అన్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం అన్నారు.
‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ... నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా...’ అంటూ శుభం కలుగాలని ఏకదంతుణ్ణి భక్తులు ఆరాధిస్తారని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటు ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని సీఎం సూచించారు.
గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోదరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. నవరాత్రులతోపాటు, నిమజ్జనం సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు.
Here's TS CMO Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)