Telangana: జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు చేసిన సీఎం కేసీఆర్, అనంతరం ప్రగతి భవన్‌లో ఆయుధ పూజ

మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు.

CM KCR Peforms Puja (Photo-Twitter/TSCMO)

ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు. పవిత్ర జమ్మి ఆకును సీఎం కేసీఆర్ అంద‌రికీ అందించి, ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీఎంవో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)