Telangana Fire: వీడియో ఇదిగో, వాంటో సుట్‌కేస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బోర్లగూడెం గ్రామంలో ఉన్న వంటో సూట్‌కేస్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.

Telangana Fire: Huge fire accident in vanto suitcase industry Watch Video

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బోర్లగూడెం గ్రామంలో ఉన్న వంటో సూట్‌కేస్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. స్థానిక అగ్నిమాపక శాఖ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకముందే అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మణికొండలోని అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం,ఈఐపీఎల్‌ అపార్ట్‌మెంట్‌ 9వ అంతస్తులో ప్రమాదం...వీడియో ఇదిగో

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతోపాటు ఆస్తినష్టం ఎంతమేరకు జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.స్థానిక అధికారులు అగ్నిమాపక శాఖ యొక్క సత్వర ప్రతిస్పందనను ప్రశంసించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పారిశ్రామిక సౌకర్యాలలో భద్రతా చర్యల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యం విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Huge fire accident in Vanto suitcase industry

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now