TSPSC New Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి, నియామకానికి ఆమోదం తెలిపిన గవర్నర్‌ తమిళిసై, టీఎస్పీఎస్సీ కొత్త టీం ఇదిగో..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి (Mahender Reddy)ని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. ఛైర్మన్‌ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా.. చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ రిపోర్ట్ గవర్నర్‌కు పంపగా.. ఆమె ఆమోదం తెలిపారు

Retired Telangana DGP M. Mahender Reddy (Photo-Facebook)

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి (Mahender Reddy)ని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. ఛైర్మన్‌ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా.. చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ రిపోర్ట్ గవర్నర్‌కు పంపగా.. ఆమె ఆమోదం తెలిపారు.ఆయనతో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై. రామ్మోహన్ రావులు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులూ రాజీనామా చేశారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now