Telangana: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌, TSPSC చైర్మన్‌గా ఎం.మహేందర్‌రెడ్డి నియామకం ఖరారైనట్లే
Governor Tamilisai Soundararajan (Photo-Video Grab)

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు ఈ పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. రానున్న రెండు రోజుల్లో గవర్నర్‌ అధికారిక ప్రకటన చేయనున్నారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ? ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ, మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు

ఇక తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు.