Rythu Bandhu: తొలి రోజు 21 వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ, పదో విడత రైతు బంధు నగదును ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
యాసంగి సీజన్‌కు సంబంధించి తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణలో రైతన్నలకు పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును వారి అకౌంట్లలో నేటి నుంచి విడతల వారీగా ప్రభుత్వం జమచేయనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేయబడ్డాయి’ అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Here's Harish Rao Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)