Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఆగస్ట్ 15 లోపల రూ. 2 లక్షల రుణమాఫీ, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్తున్నా..ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని అన్నారు.

cm revanth reddy

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్తున్నా..ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని అన్నారు. భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి రూ. 4,500 కోట్లకు పైగానే, చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

తనతో పాటు కోమటిరెడ్డి సీఎం పదవికి అర్హుడని అన్నారు. ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని, కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసారని, రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. మోడీతో కలిసి కేసీఆర్ తెలంగాణను బొందల గడ్డగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యర్థిగా జీవన్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో  రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్కడ ఏర్పాటు చేసని బహిరంగ సభకు హాజరయ్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif