Konda Vishweshwar Reddy, the BJP Candidate from Chevella Lok Sabha Constituency in Telangana (Photo Credits: X/@VlKAS_PR0NAM0)

చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3,203.90 కోట్ల ఆస్తులను ప్రకటించారు. తన భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు ఉన్నారు.  మసీదు వైపు బాణం విడుస్తున్నట్లుగా మాధవీలత యాక్షన్, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన ఒవైసీ, బీజేపీ అభ్యర్థి రియాక్షన్ ఏంటంటే..

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులు ఉన్నారు. ఈరోజు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు.