Cop Saved Farmer Life: పొలంలో పురుగుమందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు కాపాడిన పోలీసు, శభాష్ పోలీసన్న అంటున్న నెటిజన్లు
పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక్కోసారి దేవుని అవతారం ఎత్తుతుంటారనేది కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటన. పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ఓ పోలీసు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.
పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక్కోసారి దేవుని అవతారం ఎత్తుతుంటారనేది కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటన. పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ఓ పోలీసు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు. పొలాల వద్ద రైతులు గమనించి 100కి సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్‌ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి రెండు కిలోమీటర్ల మోసుకొని జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్‌కి చికిత్స అందించి కాపాడారు. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ప్రాణాలు కాపాడిన పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. వైరల్ వీడియో ఇదిగో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును సీపీఆర్ ద్వారా రక్షించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊది సాహసం
Here's News