Hyderabad, Feb 7: హైదరాబాద్ (Hyderabad) లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ లో ఆత్మహత్యకు (Suicide) ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు. యువతిని కాపాడిన కానిస్టేబుళ్లు రాజు, తరుణ్ పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలాపూర్ గ్రామంలోని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ గురువారం ఉదయం 9.45 గంటలకు బాలాపూర్ పోలీసులకు డయల్ 100 ద్వారా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో బాలాపూర్ పీఎస్ లో విధుల్లో ఉన్న రాజు రెడ్డి, ఎస్ తరుణ్ అనే కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి చూసిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ యువతి గది లోపలి నుంచి గడియపెట్టుకున్నట్టు గుర్తించారు.
Here's Video:
View this post on Instagram
ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా..
తలుపులు తీయలంటూ అడిగారు. అయితే, ఆ యువతి తీయలేదు. దీంతో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులు బద్దలు కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ యువతిని కాపాడారు. ఆమె ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాచకొండ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు సత్వర స్పందన వారి అంకితభావం ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టిందంని ఆ పోస్టులో కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నపుడు ఆత్మహత్య ఆలోచనలు చేయకుండా తమకు ఇష్టమైన వారితో మాట్లాడి, వారి సాయం తీసుకోవాలని సూచించారు.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Men's Helpline Numbers:
Milaap: 9990588768; All India Men Helpline: 9911666498; Men Welfare Trust: 8882498498.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.