Harish Rao VS Revanth Reddy: వీడియో ఇదిగో, అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో విరుచుకుపడిన హరీష్ రావు

రాజీనామా చేయమంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పారి పోయినటువంటి చరిత్ర నీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది నువ్వు.. సోనియా గాంధీని అప్పుడు దెయ్యం ఇప్పుడు దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీని అప్పుడు పప్పు అని ఈనాడు పీఎం కాండిడేట్ అంటున్నావ్ అని హరీష్ రావు మండిపడ్డారు.

Chief Minister Revanth reddy and BRS MLA Harish Rao (Photo-File Image)

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మంగళవారం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం చర్చను ప్రారంభించింది. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు చేసిన డిమాండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢీల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ వస్తే.. ప్రభుత్వాధినేతగా తాను వస్తానని రేవంత్‌ చెప్పారు.  రెండో రోజు సభకు రాని కేసీఆర్, ఆర్టీసీపై సభలో రగడ, హరీష్‌ - మంత్రి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం

ఇక హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చెయ్యాలి అన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చెయ్యాలని అన్నాడు.. అన్ని మేమే చేస్తే నువ్వు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి? మాది ఉద్యమ స్పూర్తి.. రాజీనామా చేయమంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పారి పోయినటువంటి చరిత్ర నీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది నువ్వు.. సోనియా గాంధీని అప్పుడు దెయ్యం ఇప్పుడు దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీని అప్పుడు పప్పు అని ఈనాడు పీఎం కాండిడేట్ అంటున్నావ్ అని హరీష్ రావు మండిపడ్డారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement