Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు, వీడియో ఇదిగో..
సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్.. సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారు. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. వీడియో ఇదిగో, కేసీఆర్ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున్ సాగర్‌ను జగన్ ఆక్రమించుకుంటుంటే ..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)