MLC Teenmaar Mallanna: వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ, పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెడ్లను కుక్కలతో పోల్చుతూ దూషించారని మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలిసి కోరారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.చింతపండు నవీన్ కుమార్ పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో స్వయంగా తాము డబ్బులు పెట్టి.. నవీన్‌ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని చెప్పుకొచ్చారు. కావాలనే ఓ వర్గాన్ని నవీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను వదిలే ప్రసక్తే లేదన్నారు. నవీన్‌పై తప్పకుండా పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
MLC Teenmaar Mallanna derogatory comments on Reddys Community
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)