Kishan Reddy Slams Telangana Govt: వీడియో ఇదిగో, మేము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగలేరు, వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

Kishan Reddy Slams Revanth Reddy (photo-X/FB)

బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నేతలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్డార్, సహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రె స్ కు ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.

Kishan Reddy Slams Telangana Govt:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now