Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు
గతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలు ఇవిగో, నీట మునిగిన విజయవాడ, భారీ వర్షాలకు మంగళగిరిలో విరిగిపడిన చెట్లు , నేలకొరిగిన కరెంట్ స్తంభాలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)